సొంత ఇంటి కల నెరవేరేనా .. Help to Buy పథకం ఆర్థిక సహాయం అందించనుందా?

HOUSING STOCK

The prices of houses continued to rise in many cities around the country during 2024. Credit: DARREN ENGLAND/AAPIMAGE

ఎప్పుడు లేని విధంగా ఆస్ట్రేలియాలో అద్దెకు ఇళ్లు దొరకటం కష్టమైపోతోంది. ఇందుకు ప్రధాన కారణం జనాభా పెరిగినంత వేగంగా ఇళ్ల నిర్మాణం పెరగకపోవటమే. దీనికి తోడు చిన్న, మధ్యంతర ఇళ్ల నిర్మాణ కొరత.


ప్రాప్ ట్రాక్ సంస్థ సెప్టెంబర్ లో విడుదల చేసిన నివేదికననుసరించి, మార్కెట్లో ఒకటి నుంచి రెండు బెడ్ రూమ్లు, లేదా రెండు నుంచి మూడు బెడ్ రూమ్లు గల ఇళ్లకి గిరాకి ఉన్నప్పటికీ వాటి నిర్మాణం మాత్రం గణనీయంగా పడిపోయింది. దీంతో అధిక ధరలను పెట్టి 3 నుంచి 4 లేదా 4 అంతకంటే ఎక్కువ బెడ్ రూమ్లున్న ఇళ్లను కొనుగోలు చేసే సామర్థ్యంలేక అనేకమంది first home buyers నిరాశ చెందుతున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share