EOFY సేల్స్‌ షాపింగ్ చేస్తున్నారా? తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోండి!

A man and a woman walk past a sale sign in a shop window.

A cost of living crisis is not expected to deter Australians from spending billions of dollars on sales. Credit: AAP / Steven Saphore

రిటైలర్లు మీ ఫోమోను (FOMO - Fear Of Missing Out) ప్రయోగించి, ఆర్థిక సంవత్సరాంతం సేల్స్ సమయంలో మీరు అప్రయత్నంగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఆర్థిక సంవత్సరాంతం (EOFY) సేల్స్ సమయంలో మిలియన్ల ఆస్ట్రేలియన్లు $10.1 బిలియన్లను ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు.


ఇటువంటి సమయంలో కార్లుతో సహా హాలిడే ప్యాకేజీలు నుండి బట్టలు మరియు వైట్ గూడ్స్ వరకు అనేక ఉత్పత్తులు తగ్గింపు ధరలతో అందుబాటులో ఉంటాయి.

2023లో ఆస్ట్రేలియన్లు $361 బిలియన్లను రిటైల్ వస్తువులపై ఖర్చు చేయగా, అందులో $63.6 బిలియన్లు ఆన్‌లైన్ లో ఖర్చు చేశారు. మీరు షాపింగ్ చేసేముందు తప్పక తీసుకునే చిట్కాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share