Key Points
- మీ పరిస్థితుల బట్టి, వడ్డీరేట్లు మరియు రుసుములు మారుతూ ఉంటాయి.
- మీరు రుణాన్ని బాధ్యతాయుతంగా కట్టగలరా అనే విషయాన్నీ మీ క్రెడిట్ స్కోర్ బట్టి మీ బ్యాంకు నిర్ణయిస్తుంది.
- లెండర్లు మీ క్రెడిట్ హిస్టరీ మాత్రమే చూస్తారు.
మీ పర్సనల్ లోన్ ద్వారా నెమ్మదిగా అప్పు గా తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో చెల్లించవచ్చు. సాధారణంగా కారు, సెలవులకు, వివాహం లేదా రుణ ఏకీకరణ వంటి నిర్దిష్టమైన వాటి కోసం వ్యక్తిగత రుణాన్ని తీసుకుంటారు.
"పర్సనల్ లోన్ వల్ల నిర్ణీత వ్యవధిలో ఖర్చులను తగ్గించి, డబ్బును నిర్వహించడానికి సహాయపడుతుంది" అని ASIC మనీస్మార్ట్ బృందం నుండి ఆండ్రూ డాడ్స్ వెల్ చెప్పారు.
"వ్యక్తిగత రుణాలు వల్ల నష్టమేంటంటే, లోన్ మంజూరుకు ఫీజులు మరియు వడ్డీని కూడా వసూలు చేస్తుంది."
సాధారణ రుణ పరిధి $ 2,000 నుండి $ 100,000 వరకు ఉంటుంది, తిరిగి చెల్లించే వ్యవధి రెండు నుండి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది.
మీరు పర్సనల్ లోన్ కు అర్హులా?
దరఖాస్తు చేయడానికి, మీరు తప్పనిసరిగా ఆస్ట్రేలియా పౌరుడు కాని శాశ్వత నివాసి అయి ఉండాలి. మరియు 18 ఏళ్ళు కంటే ఎక్కువ వయసు ఉన్నవారై ఉండాలి.
"తాత్కాలిక వీసా వారు కూడా పర్సనల్ లోన్ పొందగలిగే అవకాశం ఉంది. కానీ అదనపు రుజువులను చూపించాలి " అని మిస్టర్ డాడ్స్ వెల్ చెప్పారు.
లెండర్లు మాములుగా ఆస్ట్రేలియన్ క్రెడిట్ హిస్టరీ పై మాత్రమే ఆసక్తి చూపిస్తారు. వారు మీ ఉద్యోగ వివరాలు, గుర్తింపు రుజువు మరియు క్రెడిట్ కార్డులతో సహా మీ వద్ద ఉన్న ఆస్తులు మరియు అప్పులను అడుగుతారు.

Credit report form on a desk with other paperwork. There are also a pen, glasses and a calculator on the desk Credit: courtneyk/Getty Images
క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?
ఫైండర్ లో వ్యక్తిగత ఫైనాన్స్ నిపుణుడైన అమీ బ్రాడ్నీ-జార్జ్ పర్సనల్ లోన్ గురించి వివరిస్తున్నారు.
"మీ క్రెడిట్ స్కోర్ సాధారణంగా 0 మరియు 1000 మధ్య ఉంటుంది, మరియు మీరు లోన్ ను బాధ్యతాయుతంగా నిర్వహించగల మీ సామర్ధ్యాన్ని తెలియజేస్తుంది."
తక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే లెండర్లకు ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి వారు మీ వడ్డీ రేటును పెంచుతారు.Amy Bradney-George
మీరు గతంలో క్రెడిట్ కార్డులు లేదా రుణాలను సరైన సమయానికి చెల్లించనట్లైతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతూవస్తుంది.
ఒకేసారి వివిధ బ్యాంకులకు వెళ్లి లోన్ దరఖాస్తు చేయడం వల్ల , మీరు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నట్లు గుర్తించి మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గిస్తారు.

Credit: Jacobs Stock Photography Ltd/Getty Images
ఏ రకమైన పర్సనల్ లోన్ లు అందుబాటులో ఉన్నాయి?
లెండర్లు , వారి వడ్డీ రేట్లు, ఫీజులు, అవసరాలు మరియు రుణ నిబంధనలను పరిశోధించడం ప్రారంభించండి.
బ్యాంకులు మరియు మ్యూచువల్స్ వంటి ఆర్థిక సంస్థలు కూడా మంచి వడ్డీ రేట్లతో అనేక రకాల వ్యక్తిగత రుణాలను అందిస్తాయి.
"అప్పు తీసుకున్న వారు రుణం బాధ్యతాయుతమైన నిబంధనలకు కట్టుబడి, వారు తిరిగి చెల్లించే విధంగా చూస్తారు " అని లెండర్ హెరిటేజ్ అండ్ పీపుల్స్ ఛాయిస్ నుండి పాల్ ఫార్మర్ వివరిస్తున్నారు.
నాన్-బ్యాంక్ లెండర్లు వ్యక్తిగత రుణాలను అందిస్తారు కాని సాధారణంగా, వారు అంత పట్టింపుగా ఉండరు. అయితే, ఈ రుణాలపై అధిక వడ్డీ రేట్లు లేదా రుసుములను చెల్లించాల్సి వస్తుంది.
మీరు పరిగణించవలసిన రెండు ప్రధాన రకాల పర్సనల్ లోన్ లు ఉన్నాయి: సురక్షితమైనవి మరియు అసురక్షితమైనవి.
- కార్లు వంటి పెద్ద ఆస్తులను కొనుగోలు చేయడానికి సురక్షితమైన రుణాలు ఉపయోగిస్తారు. మీరు రుణ తీసుకున్నపుడు, రిస్క్ తక్కువ ఉండేలా చూడడానికి, లెండర్ మీ ఆస్తిని హామీగా తీసుకుంటారు. మీరు మీ తిరిగి చెల్లింపులు చేయకపోతే, వారు మీ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంటారు. సురక్షిత రుణాలకు సాధారణంగా స్థిర వడ్డీ రేట్లు ఉంటాయి.
- అసురక్షిత రుణాలకు సెక్యూరిటీగా ఆస్తి అవసరం లేదు, కాబట్టి వడ్డీ రేట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి.
"లెండర్ తక్కువ అప్పును మాత్రమే మంజూరు చేస్తారు " అని మిస్టర్ ఫార్మర్ చెపుతున్నారు. "రుణలు సాధారణంగా $ 2,000 నుండి $ 20,000 వరకు ఉంటాయి."
లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు రీపేమెంట్ లను క్రమం తప్పకుండా కట్టగలమనే నమ్మకం ఉంటే, మీరు సాధారణంగా ఆన్ లైన్ లో మీకు ఇష్టమైన లెండర్కు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు మీ డాక్యుమెంటేషన్ ను జోడించవచ్చు.
కొన్నిసార్లు దరఖాస్తును తిరస్కరించచ్చు, అది సాధారణ విషయమే.
మీ దరఖాస్తును పరిశీలిస్తున్నపుడు, మీ ఆదాయం తిరిగి చెల్లించడానికి సరిపోదని లెండర్ కొన్నిసార్లు అనుకోవచ్చు ,అని బ్రాడ్నీ-జార్జ్ చెపుతున్నారు.
"మీరు స్థిరమైన ఉద్యోగంలో లేకపోయినా లేదా మీరు ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయినా , వారు మీ దరఖాస్తుకు తిరస్కరించే విషయాలుగా పరిగణించవచ్చు."

You can always discuss financial hardship options with your lender if times get tough. Source: iStockphoto / Atstock Productions/Getty Images/iStockphoto
మీరు రీపేమెంట్లను కట్టలేనియెడల ఏమి చేయాలి?
ఆలస్యంగా తిరిగి చెల్లించడం వల్ల అదనపు ఫీజులను కట్టాల్సి వస్తుంది.
మీ ఆర్థిక పరిస్థితులు కష్టతరమైన పరిస్థితిలో గనక ఉన్నట్లయితే, మీ లెండర్ తో చర్చించడం ముఖ్యం.
మీరు 1800 007 007 నేషనల్ డెట్ హెల్ప్ లైన్ ద్వారా ఉచిత ఆర్థిక సలహాదారుని కూడా సంప్రదించవచ్చు.
స్కామ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి
"మిమ్మల్ని పర్సనల్ లోన్ గురించి సంప్రదించినట్లయితే, కంపెనీ లేదా మీరు వ్యవహరిస్తున్న వ్యక్తి యొక్క ఆధారాలను తనిఖీ చేయండి" అని మనీస్మార్ట్ యొక్క ఆండ్రూ డాడ్స్ వెల్ చెప్పారు.
వారితో ఎటువంటి వాటికీ హామీలు ఇవ్వొద్దు ఎప్పుడు మీ తరుపు నుండి వాకబు చేయండి, మరిన్ని సందేహాలకు సహాయం కోసం అడగండి.