Voice to Parliament: వచ్చే ఆరు నెలల్లో రెఫరెండం

వాయిస్ అభిప్రాయ సేకరణ కు పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.

Two women embrace each other in parliament house.

The legislation on the Indigenous Voice referendum question has passed federal parliament, a development that moves the nation closer to a referendum date being determined. Source: AAP / Lukas Coch

KEY POINTS:
  • రెఫరెండంలో ఒక కోటి 70 లక్షలకు పైగా ఆస్ట్రేలియన్లు ఓటు వేయనున్నారు.
  • వాయిస్-సంబంధిత పోల్స్‌పై చట్టం ఆమోదం. ఎన్నికల తేదీని నిర్ణయించాల్సి ఉంది.
  • రెండు నుంచి ఆరు నెలల్లో అభిప్రాయ సేకరణ జరగనుంది.
సెనేట్‌లో రెఫరెండం బిల్లు 19కి 52 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందింది.దీంతో వచ్చే ఆరు నెలల్లోగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.2017 వులూరు స్టేట్‌మెంట్ ఫ్రమ్ ద హార్ట్‌లోని ప్రధాన డిమాండ్లలో ఒకటైన వాయిస్ కమిటీపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది .

ఆస్ట్రేలియన్‌లకు మంచి భవిష్యత్తును కల్పించే అవకాశంగా ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.
సవరణకు సంబంధించిన పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయిందని, వాయిస్‌కు అనుకూలంగా ఉన్నవారు చెబుతున్నారు. దీని భవిష్యత్తు ఇప్పుడు ఆస్ట్రేలియా పౌరుల చేతుల్లోనే ఉంది .

Indigenous ఆస్ట్రేలియన్ల మంత్రి లిండా బర్నీ, భూమి యొక్క నిజమైన యజమానులను గుర్తించడానికి మరియు ఆస్ట్రేలియాను మరింత గొప్పగా చేయడానికి ఒక అడుగు దగ్గరగా ఉన్నామని అన్నారు.

'Indigenous ఆస్ట్రేలియన్లు చాలా కాలంగా నష్టపోతున్నారు. ఇది విచ్ఛిన్నమైన వ్యవస్థ. ఈ వ్యవస్థను చక్కదిద్దేందుకు వాయిస్ కమిటీ ఉత్తమ మార్గం' - అని లిండా బర్నీ అన్నారు.
    VOICE అనేది పూర్తిగా సలహా కమిటీ అని లేబర్ పార్టీ పునరుద్ఘాటించింది.అంటే, వాయిస్ సూచనలను అమలు చేయడం తప్పనిసరి కాకపోవచ్చు. బదులుగా, indigenous ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై పార్లమెంటు మరియు ప్రభుత్వానికి సలహా ఇచ్చే అధికారం మాత్రమే వాయిస్ కమిటీకి ఉంటుంది.
    A woman raises her fist as she walks in the parliament.
    Independent Senator Lidia Thorpe reacts after the passing of the Voice to Parliament in the Senate chamber at Parliament House. Source: AAP / Lukas Coch

    సెనేట్‌లో బిల్లు ఆమోదం పొందిన అనంతరం ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇది ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం అని అన్నారు.

    'ఇది మెజారిటీ ఆస్ట్రేలియన్లకు ఏ విధంగానూ ప్రత్యక్ష ప్రభావం చూపే అంశం కాదు. కానీ దేశంలోని అత్యంత నిర్లక్ష్యం చేయబడిన సమాజాన్ని మెరుగుపరచడంలో ప్రజాభిప్రాయ సేకరణ సహాయపడుతుంది. ఏదైనా మంచి చేయడానికి ఇదొక అవకాశం' - అని ప్రధాని అన్నారు.

    ప్రజాభిప్రాయ చట్టంపై ప్రతిపక్షాల అభిప్రాయం

    సెనేట్‌లో, వాయిస్ కమిటీని తీసుకురావడానికి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, లిబరల్ సంకీర్ణం ప్రజాభిప్రాయ సేకరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది.

    దేశ ప్రజలపై తనకు విశ్వాసం ఉందని, ఈ విషయంలో వారే నిర్ణయం తీసుకుంటారని లిబరల్ ప్రతినిధి మెకెలియా క్యాష్ అన్నారు.

    ప్రజాభిప్రాయ సేకరణ గనక జరిగితే , ఆస్ట్రేలియా రాజ్యాంగంలో 'పెద్ద మార్పు' వస్తుందని మరియు ఓట్లను విభజిస్తుందని మెకెలియా క్యాష్ ఆరోపించారు.
    వాయిస్ గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి లేబర్ పార్టీ ఇంకా సిద్ధంగా లేదని కూడా ఆమె ఆరోపించారు."మీకు ఎలా ఓటు వేయాలో తెలియకపోతే, దానికి ఉత్తమ మార్గం నో ఓటు వేయడమే" అని సెనేటర్ క్యాష్ అన్నారు.

    Coalition Indigenous ఆస్ట్రేలియన్ల ప్రతినిధి జసింతా ప్రైస్ మాట్లాడుతూ "ప్రధాని వారిని గుడ్డిగా నమ్మమంటూ మరియు వాయిస్ పై స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని" ఆరోపించారు.కొంతమంది ప్రతిపక్ష సెనేటర్లు కూడా రిఫరెండం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

    గ్రీన్స్ పార్టీ వారు దీనిని చారిత్రాత్మక రోజుగా పేర్కొన్నారు

    సెనేట్‌లో బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో లిఖించదగ్గ రోజుగా గ్రీన్స్ అబోరిజినల్ ప్రతినిధి డోరిండా కాక్స్ అభివర్ణించారు.
    ‘‘ఇది మనం కోరుకున్న లక్ష్యాలకు ప్రారంభం మాత్రమే. ఈ దేశంలోని ఆదివాసీల హక్కులను పునరుద్ధరించడమే అంతిమ లక్ష్యం. "Trust మరియు Treaty ని కూడా సాధించాలి" అని సెనేటర్ కాక్స్ అన్నారు.

    Penny Wong stands in Senate in front of a woman and two men sitting down
    Ms Burney, seated left, was present for the debate. Source: AAP / Lukas Coch
    "ఇక పార్లమెంట్ లో పని పూర్తయింది. రిఫరెండం ఎందుకు ముఖ్యమైనదో మరియు వాయిస్ సంస్థ ఎందుకు అంత ముఖ్యమైనదో ఆస్ట్రేలియన్లందరితో పంచుకోవడానికి మరియు ప్రచారానికి ఇప్పుడు సమయం వచ్చిందని ," ఆమె అన్నారు.

    లిడియా థోర్ప్ వాయిస్‌ని 'నకిలీ మరియు భూటకం ' అని విరుచుకుపడ్డారు..

    సెనేటర్ లిడియా థోర్ప్, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఆదివాసీలను అణిచివేసే ప్రక్రియలో ఇది తదుపరి చర్య అని వారు ఆరోపించారు. సెనేటర్ థోర్ప్ మాట్లాడుతూ, వాయిస్ ద్వారా సమాజం ఎలాంటి శక్తిని పొందదు, అన్నారు.స్వదేశీ ప్రజలకు స్వయంప్రతిపత్తి కల్పించడం ద్వారా వలసవాద వ్యవస్థలను కూల్చివేయాలని థోర్ప్ అన్నారు.
    Lidia Thorpe sitting in the Senate. She is wearing a grey t-shirt with the word 'Gammin' written in white
    Independent senator Lidia Thorpe reacts during debate on the Voice to Parliament in the Senate chamber at Parliament House. Source: AAP / Lukas Coch
    "మనకు ఎటువంటి శక్తిని ఇవ్వని ఈ వినాశకరమైన ఆలోచనకు నేను నో ఓటు వేస్తున్నాను" అని ఆమె చెప్పారు.

    పౌలిన్ హాన్సెన్ వ్యాఖ్యలు వివాదాన్ని లేవనెత్తాయి

    వాయిస్‌పై పార్లమెంటరీ సెషన్‌లో ప్రసంగిస్తూ, వన్ నేషన్ సెనేటర్ పౌలిన్ హాన్సన్ స్టోలెన్ జనరేషన్‌లను ఆస్ట్రేలియన్‌లకు గుర్తు చేశారు. ఇది ఎందుకు జరిగిందో అడగాలని ఆస్ట్రేలియన్‌లను కోరారు.సెనేటర్ మెక్‌కార్తీ మాట్లాడుతూ, రాబోయే నెలల్లో జరగబోయే చర్చల గురించి తాను ఆందోళన చెందుతున్నానని అన్నారు. కొన్ని వ్యాఖ్యలను వినడానికి కొంచెం అసౌకర్యంగా అనిపించిందని అన్నారు.

    సెనేటర్ మెక్‌కార్తీ మాట్లాడుతూ, వాయిస్ సిస్టమ్ గురించి చర్చలో ఆస్ట్రేలియన్లందరూ లోతుగా ఆలోచించి, గౌరవప్రదంగా తమ మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరచాలని చెప్పారు.

    ఈ సంవత్సరం చివరి నాటికి ఆస్ట్రేలియన్లందరూ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనమని లేఖ అందుకుంటారు.రాజ్యాంగ సవరణకు ఎవరైనా మద్దతిస్తున్నారా లేదా అన్నది నమోదు చేయాల్సిన అవసరం ఉంది.రెఫరెండం విజయవంతమైతే, వాయిస్ కమిటీ కూర్పుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది.

    వాయిస్ మార్పు తీసుకువస్తుందని లిండా బర్నీ చెప్పారు

    "Indigenous ఆస్ట్రేలియన్లు చాలా కాలంగా ఇతర ఆస్ట్రేలియన్ల కంటే అధ్వాన్నంగా కొనసాగుతున్నారు. దాన్ని పరిష్కరించడానికి వాయిస్ సిస్టమ్ ఉత్తమ అవకాశం" అని స్వదేశీ వ్యవహారాల మంత్రి లిండా బర్నీ అన్నారు.

    వాయిస్ అనేది Indigenous ప్రజలకు ప్రాతినిధ్యం వహించే స్వతంత్ర సంస్థ.ఈ సంస్థ ఆస్ట్రేలియన్ పార్లమెంట్ మరియు ప్రభుత్వానికి సలహా ఇస్తుంది.ఈ సంస్థ స్థానిక ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై వారి అభిప్రాయాలను అందజేస్తుంది.

    ప్రజాభిప్రాయ సేకరణను ఆమోదించడానికి, జాతీయ స్థాయిలో మెజారిటీ ఓటర్లు మరియు ఆరు రాష్ట్రాలలో కనీసం నాలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ ఓటర్లు 'అవును' అని చెప్పాలని అన్నారు.
    అంటే రెఫరెండం పాస్ కావాలంటే రెట్టింపు మెజారిటీ అవసరం.

    స్వతంత్ర సెనేటర్ డేవిడ్ పోకాక్ ప్రజాభిప్రాయ సేకరణను "కాన్‌బెర్రా వాయిస్"గా రూపొందించడానికి ప్రతిపక్ష సంకీర్ణం చేస్తున్న ప్రయత్నాలను "పచ్చి అబద్ధం"గా అభివర్ణించారు.
    2017లో స్వదేశీ నాయకులు Uluru Statement from the Heart ని ప్రచురించారు. ఈ ప్రకటన యొక్క డిమాండ్లలో పార్లమెంటుకు వాయిస్ ఒకటి.

    వాయిస్ ద్వారా, ఆస్ట్రేలియా రాజ్యాంగంలో భాగంగా దేశంలోని indigenous మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండ్ ప్రజలను గుర్తించాలా వద్దా అనే దానిపై 2023 చివరిలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు.

    ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతమైతే, అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండ్ ప్రజలతో చర్చలు నిర్వహించబడతాయి మరియు వాయిస్ రూపకల్పనను నిర్ణయించడానికి ప్రజలతో చర్చలు విస్తృతంగా నిర్వహించబడతాయి. వాయిస్ రూపొందించడానికి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది. ఇది చట్టంగా మారుతుందో లేదో పార్లమెంటు నిర్ణయిస్తుంది.

    పార్లమెంట్‌లో వాయిస్‌ యాక్ట్‌ ఆమోదం పొందగానే చట్టం అమల్లోకి వచ్చి వాయిస్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

    జాతీయ పార్టీ స్థానం

    జాతీయ నాయకుడు డేవిడ్ లిటిల్‌ప్రౌడ్ గత ఏడాది నవంబర్‌లో జాతీయ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఉన్నానని మరియు "నో" ప్రచారానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.

    వాయిస్ సిస్టమ్ "సరైన పరిష్కారం కాదని " , అతను చెప్పారు.

    వాయిస్ సిస్టమ్ లేకుండానే కమ్యూనిటీ స్థాయిలో పరిష్కారాలు సాధించవచ్చని ఆయన ఉద్ఘాటించారు.
    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా , అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.

    Share
    Published 1 July 2023 1:10pm
    By Finn McHugh, Biwa Kwan
    Presented by Sandya Veduri
    Source: SBS


    Share this with family and friends